ఏమున్నా లేకున్నా- ఎవఱేమని అనుకున్నా
ఎట్లానో ఒకలాగా - బతికేస్తాం భేషుగ్గా
ఓ ప్లేటెడు ఆహారం - ఓ లోటా హిమనీరం
పిసరంత మమకారం - భగవంతుడు దయచేస్తే
కొండల్లో కోనల్లో - అడవుల్లో ఇసకల్లో
ఎండల్లో వానల్లో - ఎకడైనా ఎపుడైనా || ఏమున్నా లేకున్నా ||
కార్లూ కంప్యూటర్లూ - కరెంటులూ గ్యాసులూ
సెల్ ఫోన్లూ టీవీలూ - అన్నీ దూరం అయినా
ఒంటరిగా జంటలుగా - బట్టలతో రొట్టలతో
పాకల్లో మాకుల్లో - దైవేచ్ఛ అనుకుంటూ || ఏమున్నా లేకున్నా ||
నగరాలూ గ్రామాలూ - నడమంత్రపు ధామాలూ
సంఘం సర్కారులూ - సమస్తం మాయం అయినా
ఱేపంటూ మాపంటూ -కొలువులు జీతాలంటూ -
బ్యాంకులొ బ్యాలెన్సంటూ - బాదరబందీ పడక || ఏమున్నా లేకున్నా ||
స్వర్గాలూ నరకాలూ - వర్గాలూ వంకాయలు
పట్టింపుల దట్టింపులు - పైవాడికి వదిలేసి
తలనిండా పట్టేసిన - చుండ్రంతా దులుపుకొని
వాడెట్లా పుట్టిస్తే - అట్లానే మనమనుకుని || ఏమున్నా లేకున్నా ||
మన కోసం మనముంటూ - మన తృప్తికి జీవిస్తూ
మన ఇష్టం కానిస్తూ - అనుమతులకు సెలవిస్తూ
మాదో లోకం అనక - మాదే ఈ లోకమని
ఎల్లెడలా వెల్లువలా - ఎల్లలు దాటి వెళతాం || ఏమున్నా లేకున్నా ||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి