మనమన్నది మనమేనా?
మనదనుకున్నది మనదేనా?
ఎటనో ఉన్నది మూలం
ఇట కనిపించేది ఫలం
తలపులు ప్రభవించని గుట్టు-
తలంలోన పదాలు పుట్టి
ఉదయించు హృదయసంవాదం
పలికించును కవిత్వనాదం
ఎదలొక్కటైన రైతులు
పదునుచేసిన గర్భవాసం
ప్రతీక్షించు నాతురతతో
పరమేశుడి ప్రాణవర్షం
చెదుఱుమదుఱుగా అపుడపుడు
చేసిన పనులకు మాటలకూ
కుదురుతుందో ఏకసూత్రం
దానితోనే జన్మ సార్థం
ఆ సమయానికి వస్తాయి
అన్నీ తామై కూడతాయి
నీడై తొడరు బ్రతుకు సమస్తం
నివుఱుగప్పిన నిగూఢహస్తం
మనదనుకున్నది మనదేనా?
ఎటనో ఉన్నది మూలం
ఇట కనిపించేది ఫలం
తలపులు ప్రభవించని గుట్టు-
తలంలోన పదాలు పుట్టి
ఉదయించు హృదయసంవాదం
పలికించును కవిత్వనాదం
ఎదలొక్కటైన రైతులు
పదునుచేసిన గర్భవాసం
ప్రతీక్షించు నాతురతతో
పరమేశుడి ప్రాణవర్షం
చెదుఱుమదుఱుగా అపుడపుడు
చేసిన పనులకు మాటలకూ
కుదురుతుందో ఏకసూత్రం
దానితోనే జన్మ సార్థం
ఆ సమయానికి వస్తాయి
అన్నీ తామై కూడతాయి
నీడై తొడరు బ్రతుకు సమస్తం
నివుఱుగప్పిన నిగూఢహస్తం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి